కొమరం భీం జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాపును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు సోమవారం ధర్నా నిర్వహించారు. వైన్ షాప్ ఎదురుగా కుట్టు మిషన్, బ్యూటీషియన్ శిక్షణ కేంద్రాలు, పాఠశాల, రోడ్డుకు సమీపంలో ఉండటం వల్ల ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని, మహిళలు, యువతులు, విద్యార్థులు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో మద్యం దుకాణం ఉండటం అనుచితమని, వెంటనే షాపును తరలించాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న రెబ్బెన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రజల అభ్యర్థనలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, శాంతిభద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.