వీవోఎల సమ్మెను జయప్రదం చేయాలి – ఏఐటీయుసి పిలుపు

రెబ్బెన మండలంలో ఈనెల 18 నుంచి వీవోఏలు చేపట్టనున్న నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు. జేఏసీ ఆధ్వర్యంలో రెబ్బెన ఏపిఎం జాడి దుర్గయ్యకు సమ్మె నోటీస్ అందజేశారు. 20 ఏళ్లుగా సేవలందిస్తున్న వీఓఏలకు కనీస వేతనం ₹20 వేలు, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తింపు, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, ప్రమోషన్లు కల్పించాలని, 58 జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే గ్రామాల్లో పొదుపు సంఘాల కార్యకలాపాలు స్తంభింపజేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్