వీఓఏలకు రూ. 26, 000 కనీస వేతనం ఇవ్వాలి: ఏఐటీయూసీ డిమాండ్

రాష్ట్రవ్యాప్తంగా వీఓఏల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. రెబ్బెన మండలంలో జరిగిన సమ్మెలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ, 20 ఏళ్లుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరవేస్తున్న వీఓఏలకు కేవలం రూ. 5,000 గౌరవ వేతనం ఇవ్వడం వెట్టిచాకిరితో సమానమని విమర్శించారు. వెంటనే రూ. 26,000 కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్