వాంకిడి మండలం కన్నార్గంకు చెందిన ఆనందరావు రియల్ మీ మొబైల్ మరియు చిన్ను రియల్ మీ మొబైల్ పోవడం వల్ల వాంకిడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా పోలీసు వారు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి బాధితునికి శుక్రవారం అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా వాంకిడి ఎస్ ఐ ప్రశాంత్ మాట్లాడుతూ మొబైల్ పోయిన లేదా దొంగిలించబడిన ప్రతి ఒక్కరూ కూడా త్వరగా స్పందించి సిఈఐఆర్ పోర్టల్ నందు ఫిర్యాదు నమోదు చేస్తే మొబైల్ ట్రేస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తెలియజేశారు.