ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా, రాష్ట్ర మంత్రి మరియు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అజ్మీర్ శ్యాంనాయక్ స్వాగతం పలికారు. కొమరంభీం జిల్లా, సిర్పూర్, ఆసిఫాబాద్‌లో మంత్రి గిరిజన కేంద్ర గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యా జ్యోతి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, గిరిజన ప్రాంతాల్లో విద్యా సదుపాయాల విస్తరణ మరియు విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.