కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ ప్లస్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. డైట్, బీఎడ్ ఛాత్రోపాధ్యాయుల ద్వారా క్షేత్రస్థాయి విద్యార్థుల నమోదు, హాజరు సంఖ్య, మౌలిక వసతుల వంటి అంశాలపై 599 పాఠశాలల్లో సర్వే చేయనున్నారు. జిల్లాకు సర్వే చేయడానికి 59 మందిని ఎంపిక చేసి ఇదివరకే శిక్షణను ఇచ్చారు. సర్వే ద్వారా అవసరమైన వసతులు కల్పించనున్నారు.