వైఎస్సార్ వర్ధంతి: కాంగ్రెస్ ఘన నివాళి

వాంకిడి మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ వాంకిడి మాజీ అధ్యక్షుడు గుర్నూలే నారాయణ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ప్రజా సంక్షేమానికి వైఎస్సార్ చిరస్మరణీయం.

సంబంధిత పోస్ట్