కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో జోనల్ స్థాయి వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్‌కు చెందిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొని హోరాహోరీగా తలపడ్డారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి మడావి శేకు, వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సమనపల్లి బ్రహ్మం, ఆర్గనైజింగ్ సెక్రటరీ కుర్సెంగా శ్రీనివాస్, ఉపాధ్యాయులు, పీడీలు పాల్గొన్నారు.