ఆసిఫాబాద్ లో కోతుల స్వైరవిహారం

ఆసిఫాబాద్ పట్టణంలోని జానకాపూర్ కాలనీలో కోతుల బెడద తీవ్రమైంది. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడమే కాకుండా, చిన్నపిల్లలు, వృద్ధులపై దాడికి ప్రయత్నిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్ల పైకప్పులపై కోతులు గుంపులు గుంపులుగా చేరుతుండటంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కోతులను పట్టి అడవిలో విడిచిపెట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్