పరీక్ష రాసిన 72ఏళ్ల వృద్ధురాలు

సిర్పూర్(యు) మండలంలో ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షల్లో 72 ఏళ్ల ఆదివాసీ వృద్ధురాలు మెస్రం జీజాబాయి ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల్లో ఆమె అక్షరాలను సులువుగా చదవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ కార్యక్రమం ద్వారానే తాను చదువుకోవడం నేర్చుకున్నానని, చదువుకు వయసు అడ్డంకి కాదని జీజాబాయి నిరూపించారు. ఈ విషయాన్ని ఏపీఎం రమేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్