కౌటాల మండలం సాండ్‌గాం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, డాక్టర్ ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శాశ్వత పరిష్కారం చూపారు. గ్రామంలో తీవ్ర నీటి కొరత నెలకొన్న సమయంలో స్పందించి బోరు ఏర్పాటు చేయించడం వల్ల ప్రజల తాగునీటి ఇబ్బందులు తొలగాయని గ్రామస్తులు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. గ్రామాభివృద్ధికి ఇలాగే సహకారం అందించాలని కోరారు.