కౌటాల ఆర్ఎంపి పీఎంపి అధ్యక్షుడిగా ఆదే నాందేవ్ ఏకగ్రీవం

కౌటాల మండలంలో ఆర్ఎంపి పీఎంపి సంఘం ఎన్నికలు బుధవారం శాంతియుతంగా జరిగాయి. జిల్లా గౌరవ అధ్యక్షుడు జి. లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో ఆదే నాందేవ్ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఆదే నాందేవ్ వైద్యుల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి సభ్యులు హాజరై ఆయనకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్