ఆరె కులస్తులకు కేంద్ర ఓబీసీ జాబితాలో స్థానం కల్పించాలి: సిర్పూర్ ఎమ్మెల్యే

న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఓబీసీ సెమినార్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలోని ఆరె కులస్తులు రాష్ట్ర ఓబీసీల జాబితాలో ఉన్నప్పటికీ, కేంద్ర జాబితాలో లేకపోవడం వల్ల విద్య, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. కేంద్ర ఓబీసీ జాబితాలో ఆరె కులస్తులను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంత్రి రాందాస్ అటవలె, ఎంపీలు ఈటెల రాజేందర్, విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్