కెరమేరి మండలంలోని ఝరి జడ్పీఎస్ఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కమిటీ సభ్యులతో కలిసి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. 110 మంది విద్యార్థులకు కేవలం 3 మంది ఉపాధ్యాయులే ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సబ్జెక్టుకు ఉపాధ్యాయులను నియమించాలని విజ్ఞప్తి చేశారు.