సిర్పూర్ ప్రాంతంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేంపల్లిలో బుధవారం వార్షికోత్సవం, పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ ఘనంగా జరిగింది. ప్రధానోపాధ్యాయులు కటుకం మధూకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాడి దేవాజీ, జనార్ధన్, చిలుకూరి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలనం చేశారు. వంద శాతం హాజరు సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. పూర్వ ఉపాధ్యాయురాలు తేలు శ్రీలత రచించిన “నీలవేణి శతకం” పుస్తకాన్ని ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.