ఎస్పీ ప్రెస్ మీట్‌లో దొంగల గ్యాంగ్ అరెస్ట్ వెల్లడి

కాగజ్నగర్ టౌన్‌లో వరుస గృహ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిర్సిల్క్ కాలనీలో తాళం వేసి హైదరాబాద్ వెళ్లిన ANM దండే మంగా ఇంట్లో 7½ తులాల బంగారం, 1 కిలో వెండి దొంగిలించిన కేసులో ఇర్షాద్ పాషా, షైక్ అంజద్, మిర్జా సోహైల్ బేగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. దొంగిలించిన ఆభరణాలను స్వీకరించిన గోల్డ్స్మిత్ శ్రీకాంత్‌ను కూడా అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఆస్తితో నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ప్రజలు సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్