కాగజ్‌నగర్‌లో అర్సద్ హుస్సేన్ ప్రెస్‌మీట్ నిర్వహణ

కాగజ్‌నగర్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో అర్సద్ హుస్సేన్ శనివారం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల హామీలను పార్టీ నిలబెట్టుకోవడం లేదని, మున్సిపల్ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌పీకి 6, కోనప్పకు 24 టికెట్లు ఇస్తామనడం రాష్ట్ర నాయకుడికి అవమానమని అన్నారు. సర్పంచ్ ఎన్నికల నుంచే కోనప్ప దౌర్జన్యాలతో విసిగి ఆర్‌ఎస్‌పీని సిర్పూర్‌కు తీసుకొచ్చామని తెలిపారు. సమ్మక్క గద్దెల వద్ద కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించి, వెంటనే సస్పెండ్ చేయకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్