జైనూర్ పట్టణంలో నిర్మించిన కొత్త సామూహిక మరుగుదొడ్ల ప్రారంభోత్సవంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆమెతో పాటు అదనపు కలెక్టర్ దీపక్ తివారి పాల్గొన్నారు. పరిశుభ్రత ఇంటి నుంచి మొదలై పట్టణం వరకు ఉండాలని, ఈ మరుగుదొడ్లు ప్రజారోగ్యానికి దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.