ఆసిఫాబాద్ మండలం రహపెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొగడగూడలో సంవత్సరం క్రితం ట్రాక్టర్ బోరింగ్ కోసం తీసిన బోరు ప్లాట్ పారం పగిలిపోయింది. పగిలిన దానిలో పాములు నివాసముంటున్నాయని స్థానికులు తెలిపారు. పలు మార్లు ఫిర్యాదు చేసినా పంచాయతీ కార్యదర్శి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మర్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.