కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో శనివారం "జర్నలిజం – మౌళికాంశాలు" అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డా. కంబాల మురళికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు వార్తలు ఎలా రాయాలి, వార్త నిర్మాణం వంటి ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పించారు. జర్నలిజంను మంచి కెరీర్ అవకాశంగా ఎంచుకోవచ్చని ఆయన సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీదేవి మాట్లాడుతూ, ఇలాంటి సదస్సులు విద్యార్థులకు అదనపు జ్ఞానాన్ని అందిస్తాయని తెలిపారు.