బెజ్జూర్: రైతుల పంట నష్టం పరిహారం అందక నిరాశ

ప్రాణహిత నదిలో వరద నీరు పెరగడంతో బ్యాక్ వాటర్ బెజ్జూర్, కౌటాల, CMపల్లి, పెంచికలపేట్, దహేగాం మండలాల్లోని అనేక గ్రామాల్లో పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయి. ప్రతి ఏడాది వరుసగా పత్తి, వరి పంటలు నీట మునిగి రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ, గత 12 ఏళ్లుగా పంట నష్టానికి సరైన పరిహారం అందడం లేదని శుక్రవారం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్