భక్తుల ముంగిటకే భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు

తెలంగాణ పోస్టల్ సర్కిల్, రాష్ట్ర దేవాదాయ శాఖ సహకారంతో భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవ తలంబ్రాలు, ప్రసాదాన్ని భక్తుల ఇంటి వద్దకే చేరవేసే ప్రత్యేక సేవను ప్రారంభించింది. కొమరంభీం జిల్లాలోని పోస్టాఫీసుల్లో ఈ సేవ కోసం బుకింగ్ చేసుకోవచ్చు. అంతరాలయ అర్చన ప్యాకేజీ రూ. 450, ముత్యాల తలంబ్రాల ప్యాకేజీ రూ. 151గా నిర్ణయించారు. మార్చి 20, 2026 వరకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. శ్రీరామనవమి అనంతరం తలంబ్రాలను స్పీడ్ పోస్ట్ ద్వారా భక్తులకు పంపిణీ చేస్తారు.

సంబంధిత పోస్ట్