భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ఆలస్యం: ప్రయాణికుల ఆవేదన

సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ నిత్యం గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెల్లంపల్లి దాటిన తర్వాత క్రాసింగ్‌ల వల్లే రైలు ఆలస్యమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో కాగజ్‌నగర్ చేరుకోవడంతో ఆటోలు, బస్సులు దొరక్క, భోజన వసతి లేక రైల్వే స్టేషన్‌లోనే జాగారం చేయాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ ఆలస్యం వల్ల ప్రయాణికుల దైనందిన జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోంది.

సంబంధిత పోస్ట్