కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండల కేంద్రంలో బౌద్ధ సమాజ్ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ శౌర్య దినోత్సవం సందర్భంగా అమరైన మహార్ సైనికులకు నివాళులర్పించారు. బౌద్ధ మహాసభ తాలూకా అధ్యక్షులు బి. విశ్వనాథ్ మాట్లాడుతూ, 1818 జనవరి 1న 500 మంది మహార్ లు 28వేల పిశ్వా సైనికులను ఎదిరించి, సమానత్వానికి, ఆత్మగౌరవానికి గెలుపు సాధించారని గుర్తు చేశారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.