సిర్పూర్ మండలం భూపాలపట్నం గ్రామ పంచాయతీలో ఎస్టీ జనరల్ స్థానానికి కోర్వెత రాజారాం అనే వ్యక్తి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే, అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశమైంది.