సిర్పూర్ టౌన్ మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నాలుగు లేబర్ కోడ్ల అమలును నిరసిస్తూ పలు పనిప్రదేశాల్లో బ్లాక్ డే నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపిన కార్మికులు, కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు-2022ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేరళ ప్రభుత్వం ఈ కోడ్లను అమలు చేయమని హామీ ఇచ్చిందని, తెలంగాణలో కూడా అలాంటి హామీ ఇవ్వాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని సిఐటియు జిల్లా సహా కార్యదర్శి వెలిశాల క్రిష్ణమాచారి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.