కాగజ్‌నగర్ ఎఫ్ కాలనీలో గల మహంకాళి ఆలయంలో ఆదివారం మాహాంకాళి బోనాల జాతర సందర్భంగా కమిటీ అధ్యక్షుడు తుమ్మ రమేష్-మల్లికా దంపతులు అమ్మవారికి మొదటి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మునిసిపల్ కమిషనర్ ఎ. రాజేందర్ అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.