కుమురం భీమ్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ ఎఫ్ కాలనీ, సిర్‌సిల్క్ ప్రాంతంలో సమ్మర్ బాక్సింగ్ శిక్షణ శిబిరం ఏప్రిల్ 30 నుంచి మే 31 వరకు కొనసాగనుంది. మాజీ ఎంసీకే చైర్మన్ దస్తగీర్ అహ్మద్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వేముర్ల మధు, ఉపాధ్యక్షుడు జయేందర్, చైర్మన్ శివ నాయర్, కార్యదర్శి మధురై శేఖర్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ శిబిరంలో కోచ్‌లు క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్నారు.