గత కొన్నేళ్లుగా కాగజ్‌నగర్ మండలం చింతగూడ, కోయవాగు రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడంతో అధ్వానంగా మారింది. దీంతో బీఆర్ఎస్ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్యామ్ రావు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి సోమవారం శ్రమదానం చేసి రోడ్డుకు మరమ్మతులు చేసుకున్నామని చెప్పారు. కాగజ్‌నగర్ కు వెళ్లే ప్రధాన రహదారిని అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.