కాగజ్‌నగర్ లోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని శనివారం బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్యామ్ రావు అభ్యర్థించారు. పాఠశాల సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ కారణంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.