కాగజ్‌నగర్ మండలంలోని కోయవాగు గ్రామంలో గ్రామపంచాయతీ ట్రాక్టర్‌లో పశువుల కళేబరాలను తరలిస్తుండగా స్థానిక యువకులు గుర్తించి అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. యువకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కళేబరాల తరలింపుపై పోలీసులు విచారణ చేపట్టి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.