పట్టణంలోని హనుమాన్ మందిరంలో మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు జరిగిన చాంగ్ కార్యక్రమంలో కౌన్సిలర్ శివ గౌడ్ పాల్గొన్నారు. హోలీ సందర్భంగా భక్తులు గులాల్ చల్లుకుంటూ, భజనలు ఆలపిస్తూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పట్టణ ప్రజలు భారీగా హాజరయ్యారు. కౌన్సిలర్ శివ గౌడ్ హిందూ సోదర సోదరీమణులకు హోలీ శుభాకాంక్షలు తెలిపి, రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందం, ఐక్యత నింపాలని ఆకాంక్షించారు.