కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం పరిధిలోని దిందా వాగులో గురువారం దుర్ఘటన చోటు చేసుకుంది. కేతిని గ్రామానికి చెందిన సెడుమకే సుమన్ (18) అనే యువకుడు చెరకు పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా వాగులో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటనపై స్థానికులు సమాచారం అందించారు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.