కౌటాల సర్పంచ్ రిజర్వేషన్‌పై వివాదం

కౌటాల మండలం బోధంపల్లి సర్పంచ్ స్థానానికి బీసీ అభ్యర్థి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్‌తో నామినేషన్ వేశారని బీఆర్ఎస్ స్టూడెంట్ ఔట్రీచ్ కన్వీనర్ రామ్టెంకి నవీన్ బుధవారం ఆరోపించారు. ఎస్టీ మహిళలకు రిజర్వ్ చేసిన స్థానంలో ఈ అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు. ఈ విషయంపై ఎమ్మార్వో, ఎంపీడీఓ స్పందించకపోవడంతో నిరసన తెలిపారు. వెంటనే నామినేషన్ రద్దు చేయకపోతే ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్