కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో దహన సంస్కారాలకు కట్టెల పంపిణీ

సిర్పూర్(టి) మండలంలోని కోనేరు కాలనీ గ్రామానికి చెందిన బండారి సకారామ్ మృతి చెందగా, వారి కుటుంబానికి అండగా నిలుస్తూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారి తరఫున దహన సంస్కారాల నిర్వహణ కోసం కట్టెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కోనప్ప గారి సేవా దృక్పథాన్ని అభినందిస్తూ, కష్టసమయంలో కుటుంబానికి సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, దివంగత ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్