కాగజ్‌నగర్: పాఠశాలలో ఐడీ కార్డులు పంపిణీ

కాగజ్‌నగర్ మండలం జీడిచేను గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రాసపల్లి శాఖ మేనేజర్ శుక్రవారం శ్రీ కాట సాయి చరణ్ విద్యార్థులకు ఐడీ కార్డులు, టైలు, బెల్ట్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్‌ కోసం అవసరమైన సౌకర్యాలు అందించడంలో భాగంగా మేము ఈ చిన్న సహాయాన్ని చేశాం అని తెలిపారు. గ్రామస్థులు, ఉపాధ్యాయులు కాట సాయి చరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్