లయన్స్ క్లబ్ 320జీ కాగజ్‌నగర్ కొత్తపేట శాఖ 18వ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమంలో లయన్ డా. కొత్తపల్లి అనిత ఎంజేఎఫ్ నూతన అధ్యక్షురాలిగా, లయన్ సాయి కిరణ్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా, లయన్ రతన్ గైన్ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ నారాయణ రెడ్డి, ప్రోగ్రాం చైర్మన్ డా. కొత్తపల్లి శ్రీనివాస్, రీజియన్ చైర్మన్ బాపు రెడ్డి, జోనల్ చైర్మన్ పోతురాజుల లక్ష్మణ్ సమక్షంలో ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా డా. కొత్తపల్లి అనిత మాట్లాడుతూ, గత 18 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, శ్రీ కొత్తపల్లి వెంకటలక్ష్మి చంద్రయ్య సొసైటీ సహకారంతో కంటి ఆపరేషన్లు చేయించామని తెలిపారు.