వార్డు 15, 17ల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా డా. పాల్వాయి

కాగజ్‌నగర్ పట్టణంలోని ఓల్డ్ కాలనీలో వార్డు నంబర్ 15, 17ల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గొల్లపల్లి వీరభద్ర చారి, కాట్రగడ్డ లోకేష్‌లకు మద్దతుగా సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు ప్రచారం నిర్వహించారు. యువత, చదువుకున్న వారికి ఓటు వేసి మంచి స్థానిక నాయకత్వాన్ని ఏర్పరుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వార్డుల్లో డ్రైనేజీ, మురికి నీటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు ఆర్మీ శివ కుమార్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్