జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు అన్నారు. శనివారం కాగజ్‌నగర్‌లోని పటేల్ గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సమావేశానికి హాజరై మాట్లాడారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇప్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కొమురంభీం జిల్లా జర్నలిస్టులు హాజరయ్యారు.