పెంచికల్‌పేట్ మండలంలోని గుండేపల్లి, కమ్మర్గాం, నందిగాం గిరిజన గ్రామాల్లో సెల్‌ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొనుగోలుకు యాప్‌లో తప్పనిసరిగా బుకింగ్ చేయాల్సి ఉండగా, నెట్‌వర్క్ సమస్యతో ప్రక్రియ నిలిచిపోతోంది. సిగ్నల్ కోసం రైతులు గుట్టలు, చెట్లపైకి ఎక్కుతున్నారు. యాప్ ఆధారిత బుకింగ్ విధానాన్ని రద్దు చేసి, నేరుగా యూరియా పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు.