కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లోని కిమ్స్ మల్టిస్పెషలిటీ ఆసుపత్రిలో శ్రీ కొత్తపల్లి వెంకట లక్ష్మీ–చంద్రయ్య మెమోరియల్ సర్విస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి శిబిరానికి ప్రజలు విశేష స్పందన తెలిపారు. ఈ శిబిరంలో మొత్తం 31 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 12 మందికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు గుర్తించారు. లయన్స్ క్లబ్ బెల్లంపల్లి సహకారంతో ఈ శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించబడతాయి. నిర్వాహకుల ప్రకారం, ఈ శిబిరం ప్రతి మంగళవారం కొనసాగుతుంది.