సిర్పూర్: 'జీవో నం. 49 రద్దు చేయాలని గ్రామసభ తీర్మానం'

తెలంగాణ ప్రభుత్వం "కొమరంభీం కన్జర్వేషన్ రిజర్వ్" ఏర్పాటు చేయాలని జీవో నం. 49 ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వు స్థానిక గిరిజనుల హక్కులను ఉల్లంఘించడమేనని సోమవారం సిర్పూర్ మండల గ్రామసభ అభిప్రాయపడింది. ఈ మేరకు సిర్పూర్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో, ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు. గ్రామసభ తీర్మాణం లేకుండా జీవో 49 తీసుకురావడాన్ని నిరసిస్తూ, వెంటనే ఈ ఉత్తర్వును రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.

సంబంధిత పోస్ట్