సిర్పూర్ టి మండలంలోని వెంకట్రావు పేట గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్తలు మంగళవారం కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తమ గ్రామ అభివృద్ధికి కోనేరు కోనప్ప గతంలో ఎంతో కృషి చేశారని, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దంద్రే యోగిదాస్ ను గెలిపించాలని కోనేరు కోనప్ప పిలుపునిచ్చారు.