సిర్పూర్: ఇళ్ల కేటాయింపులో అక్రమాలు: పాల్వాయి హరీశ్

సిర్పూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు ఆరోపించారు. గురువారం కొమరంభీం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్కకు జరుగిన అన్యాయాలపై ఆయన బహిరంగ లేఖ రాశారు. ఇళ్ల కేటాయింపుపై విచారణ జరపాలని, అర్హులైన వారికి ఇళ్లు వచ్చే విధంగా చూడాలని లేఖలో పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్