కాగజ్‌నగర్‌లో ఐయుఎంఎల్ పార్టీ కార్యాలయ ప్రారంభం

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో ఆదివారం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ షకీల్ ప్రారంభించారు. ప్రజాసేవ, సామాజిక న్యాయం, అన్ని వర్గాల హక్కుల పరిరక్షణే పార్టీ లక్ష్యమని, రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. యువత, మహిళలు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్