జైనూర్ మండలంలోని పట్నాపూర్ శ్రీ పరమహంస సద్గురు పూలజీ బాబా సిద్దేశ్వర్ సంస్థాన్ లో గురువారం గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో దంపతుల సమేతంగా పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో సంస్థాన్ ఆలయం కిటకిటలాడింది. బాబా సమాధి వద్ద కుటుంబ సమేతంగా పూజ నిర్వహించి బాబా ఆశీస్సులు పొందారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన ధ్యాన ధారణతో కార్యక్రమం ప్రారంభించారు.