కాగజ్‌నగర్ మండలం కడంబ గ్రామ పంచాయితీ యూవకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. బుధవారం కాగజ్‌నగర్ పట్టణంలోని ఆర్ఎస్పీ నివాసంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం అయ్యింది, 15 నెలల కాలం అంతా అబద్దపు హామీలతో గడిపేసిందని, పథకాలు, హామీలు అన్నీ ఉత్తమాటలని విమర్శించారు.