సుప్రీం కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కాగజ్‌నగర్ పట్టణంలోని డీ. సంజీవయ్య కాలని వార్డు కౌన్సిలర్ గొడిసెల ఎల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కాలనీలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు నక్క మనోహర్, గోగర్ల కన్నయ్య, కాలని వాసులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.