గెస్ట్ ఫ్యాకల్టీకి న్యాయం చేయాలి: ఆర్ఎస్పీ

గెస్ట్ ఫ్యాకల్టీకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, వారిని మోసం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపు, వేతన భద్రత, ఉద్యోగ భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో గౌరవప్రదమైన వేతనాలు, పని భద్రత కల్పించామని గుర్తుచేశారు. వెంటనే అన్ని హామీలు అమలు చేసి గెస్ట్ ఫ్యాకల్టీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్