బీజేపీ కాగజ్‌నగర్ పట్టణ అధ్యక్ష పదవికి K. శివ కుమార్ రాజీనామా

మాజీ ఆర్మీ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీగా పనిచేసిన కే. శివ కుమార్, బీజేపీ కాగజ్‌నగర్ పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రజల సమస్యలను దగ్గరగా చూసి రాజకీయాల్లోకి వచ్చి, వ్యక్తిగత లాభం ఆశించకుండా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానని తెలిపారు. అయితే, కొన్ని అనివార్య కారణాలు, సంస్థాగత లోపాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంలో కొనసాగుతూ దేశం, ధర్మం కోసం పని చేస్తానని, జిల్లా నాయకత్వం, కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్